బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 429 పాయింట్లు పడి 72,639 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 173 పాయింట్లు కోల్పోయి 22,603 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్లు పడి 55,056 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,121.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,596.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో రివర్సల్కి సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న కొన్ని రోజులు చాలా కీలకం. 22,600 లెవల్ కన్నా దిగువకు పడితే సూచీపై బేర్ల పట్టు పెరగొచ్చు. అదే జరిగితే నిఫ్టీ50 22,200 వరకు వెళుతుంది. అయితే, 22,750 దాటితే మాత్రం సూచీలో బుల్లిష్ రన్ కనిపించవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.66 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.22శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.21 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరోసారి 100 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పెరిగి బ్యారెల్కు 101.8 డాలర్లకు పెరిగింది.
స్టాక్స్ టు బై..
AEGISLOG: బై రూ. 1465, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1600
CLEANMAX: బై రూ. 1390, స్టాప్ లాస్ రూ. 1320, టార్గెట్ రూ. 1525
LGEINDIA: బై రూ. 1785, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1950