అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల మళ్లీ కమ్ముకున్న వేళ బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1677 పాయింట్లు పడి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1458 పాయింట్లు పడి 56,743 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,962.80 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 790.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో భారీ బేర్ క్యాండిల్ ఏర్పటింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్ సెషన్స్ కదలికలను ఒక్క క్యాండిల్ కనుమరుగు చేసింది. నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్ షార్ప్‌గా కిందకి పడిపోయింది. మూడియం టర్మ్ ట్రెండ్ మాత్రం పాజిటివ్‌గానే ఉంది, నిఫ్టీ50కి 23,600 వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,100 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 1.09 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.20 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.03శాతం పెరిగి బ్యారెల్‌కి 78.82 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పీపీఏపీ ఆటోమోటివ్- బై రూ. 257, స్టాప్ లాస్ రూ. 243, టార్గెట్ రూ. 280
ఐనాక్స్ ఇండియా - బై రూ. 1875, స్టాప్ లాస్ రూ. 1788, టార్గెట్ రూ. 2030
సెనోరెస్ ఫార్మా- బై రూ. 1409, స్టాప్ లాస్ రూ. 1340, టార్గెట్ రూ. 1500
సిల్వర్ టచ్ టెక్నాలజీస్- బై రూ. 188, స్టాప్ లాస్ రూ. 178, టార్గెట్ రూ. 204
ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్- బై రూ. 1853, స్టాప్ లాస్ రూ. 1765, టార్గెట్ రూ. 2000