...
...
Next Story

Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఎటర్నల్, నైకా షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..

అక్టోబర్ 30, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 30, 2026, 08:15:13 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 905 పాయింట్లు పెరిగి 74,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 238 పాయింట్లు వృద్ధిచెంది 22,937 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 642 పాయింట్లు పెరిగి 54,910 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 943.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,924.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,000 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. మరోవైపు ఆర్​ఎస్​ఐ ఇండికేటర్ బుల్లిష్ క్రాసోవర్ సూచించింది. ఇది షార్ట్​ టర్మ్​లో పాజిటివ్​ మూమెంట్​కి సంకేతం. నిఫ్టీ50 22,800 లెవల్ ఎగువ ఉన్నంత వరకు సెంటిమెంట్​ పాజిటివ్​గానే ఉన్నట్టు భావించాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వాత్సల్ భువ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.25 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.4 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ దాదాపు 1.9శాతం పెరిగి బ్యారెల్​కు 112.8 డాలర్ల వద్దకు చేరింది. కాగా కొన్ని రోజుల క్రితమే ఇది దాదాపు 117 డాలర్ల వద్ద ఉండేది. దీనితో పోల్చుకుంటే ప్రస్తుతం ధర తగ్గినట్టే

స్టాక్స్​ టు బై..

జెన్​సార్​టెక్- బై రూ. 540, స్టాప్​ లాస్​ రూ. 515, టార్గెట్​ రూ. 605

బ్లూస్టార్​కో- బై రూ. 1675, స్టాప్​ లాస్​ రూ. 1590, టార్గెట్​ రూ. 1850

డీఎల్​ఎఫ్- బై రూ. 697, స్టాప్​ లాస్​ రూ. 660, టార్గెట్​ రూ. 770

కొటాక్ మహీంద్రా బ్యాంక్- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 445, టార్గెట్​ రూ. 485

నైకా- బై సీఎంపీ, స్టాప్ లాస్​ రూ. 340, టార్గెట్​ రూ. 373

ఎటర్నల్- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 326, టార్గెట్​ రూ. 357

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks