Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఎటర్నల్, నైకా షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
అక్టోబర్ 30, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 905 పాయింట్లు పెరిగి 74,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 238 పాయింట్లు వృద్ధిచెంది 22,937 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 642 పాయింట్లు పెరిగి 54,910 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 943.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,924.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,000 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. మరోవైపు ఆర్ఎస్ఐ ఇండికేటర్ బుల్లిష్ క్రాసోవర్ సూచించింది. ఇది షార్ట్ టర్మ్‌లో పాజిటివ్ మూమెంట్‌కి సంకేతం. నిఫ్టీ50 22,800 లెవల్ ఎగువ ఉన్నంత వరకు సెంటిమెంట్ పాజిటివ్‌గానే ఉన్నట్టు భావించాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వాత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.25 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.4 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ దాదాపు 1.9శాతం పెరిగి బ్యారెల్‌కు 112.8 డాలర్ల వద్దకు చేరింది. కాగా కొన్ని రోజుల క్రితమే ఇది దాదాపు 117 డాలర్ల వద్ద ఉండేది. దీనితో పోల్చుకుంటే ప్రస్తుతం ధర తగ్గినట్టే
స్టాక్స్ టు బై..
జెన్సార్టెక్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 515, టార్గెట్ రూ. 605
బ్లూస్టార్కో- బై రూ. 1675, స్టాప్ లాస్ రూ. 1590, టార్గెట్ రూ. 1850
డీఎల్ఎఫ్- బై రూ. 697, స్టాప్ లాస్ రూ. 660, టార్గెట్ రూ. 770
కొటాక్ మహీంద్రా బ్యాంక్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 445, టార్గెట్ రూ. 485
నైకా- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 340, టార్గెట్ రూ. 373
ఎటర్నల్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 326, టార్గెట్ రూ. 357
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


