Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

stocks to buy today : మే 6, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 6, 2026, 08:17:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 252 పాయింట్లు పడి 77,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 86 పాయింట్లు కోల్పోయి 24,033 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 331 పాయింట్లు పడి 54,547 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

కాగా ఇరాన్​తో యుద్ధాన్ని ముగించేందుకు త్వరలోనే శాంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంకేతాలివ్వడంతో బుధవారం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభాల బాటపట్టాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,621.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,602.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,850- 23,900 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,300 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే పైకి వెళ్లొచ్చు," అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.73 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.81శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.03 శాతం పెరిగింది.s

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

చమురు ధర..

ఇరాన్​తో అమెరికా చర్చల సంకేతాల నేపథ్యంలో ముడి చమురు ధర పడింది. బ్రెంట్​ క్రూడ్ 1.38శాతం పడి బ్యారెల్​కు 108.35 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్ టు బై..

మనోరమా ఇండస్ట్రీస్- బై రూ. 1594, స్టాప్​ లాస్ రూ. 1515, టార్గెట్​ రూ. 1715

ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 360, స్టాప్​ లాస్​ రూ. 346, టార్గెట్​ రూ. 390

అపొలో మైక్రో సిస్టెమ్స్- బై రూ. 308, స్టాప్​ లాస్​ రూ. 294, టార్గెట్​ రూ. 330

సైర్మా సీజీఎస్ టెక్నాలజీ- బై రూ. 1058, స్టాప్​ లాస్​ రూ. 1015, టార్గెట్​ రూ. 1150

గ్రావిటా ఇండియా లిమిటెడ్- బై రూ. 1722, స్టాప్​ లాస్​ రూ. 1655, టార్గెట్​ రూ. 1870

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More