Stock market : ట్రేడర్స్​ అలర్ట్- చమురు ధర డౌన్, స్టాక్​ మార్కెట్​ జంప్! స్టాక్స్ టు బై టుడే లిస్ట్ ఇదే..

stocks to buy today : మే 4, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 4, 2026, 07:37:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Stock market news : మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 583 పాయింట్లు పడి 76,913 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 180 పాయింట్లు కోల్పోయి 23,998 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 540 పాయింట్లు పడి 54,863 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితితో పాటు దేశంలో నేడు వెలువడనున్న 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు.. స్టాక్​ మార్కెట్​లకు ప్రభావితం చేయనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,047.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,487.10 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.31 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.29శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.89 శాతం వృద్ధి చెందింది.

“దలాల్​ స్ట్రీట్ ప్రస్తుతం అప్రమత్తంగా ఉంది. నిఫ్టీ50 23,800- 24,300 మధ్యలో ట్రేడ్​ అవుతోంది. బ్రేకౌట్​ అయితే అటువైపు డైరక్షన్​ని కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో సూచీ ఎటువైపు బ్రేకౌట్​ అవుతుందో వేచి చూడాలి,” అని ప్రభుదాస్ లిల్లాధేర్​కి చెందిన వైస్​ ప్రెసిడెంట్, టెక్నికల్​ రీసెర్చ్ వైశాలీ పరేఖ్​ తెలిపారు.

ముడి చమురు ధర..

గత వారం బ్యారెల్​కు 115 డాలర్లు దాటేసిన బ్రెంట్​ క్రూడ్​ ఇప్పుడు కాస్త కూల్​-ఆఫ్​ అవుతోంది. సోమవారం ట్రేడింగ్​లో బ్రెంట్​ క్రూడ్​ 0.41శాతం పడి, బ్యారెల్​కి 107.73 డాలర్లకు చేరింది.

స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​పై అమెరికా- ఇరాన్ వైఖరిపైనే ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి.

స్టాక్స్​ టు బై..

తిరుమలై కెమికల్స్- బై రూ. 200, స్టాప్​ లాస్​ రూ. 197, టార్గెట్​ రూ. 210

సీఈఎస్​సీ- బై రూ. 185, స్టాప్​ లాస్​ రూ. 180, టార్గెట్​ రూ. 195

భారత్ డైనమిక్సి- బై రూ. 1364, స్టాప్​ లాస్​ రూ. 1346, టార్గెట్​ రూ. 1390

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పాండీ ఆక్సిడెస్ అండ్ కెమికల్స్- బై రూ. 1382, స్టాప్​ లాస్​ రూ. 1300, టార్గెట్​ రూ. 1515

బ్లిస్​ జీవీఎస్​ ఫార్మా- బై రూ. 276.5, స్టాప్​ లాస్​ రూ. 265, టార్గెట్​ రూ. 300

ఎస్​జేఎస్​ ఎంటర్​ప్రైజెస్- బై రూ. 1808.5, స్టాప్​ లాస్​ రూ. 1705, టార్గెట్​ రూ. 1950

భారత్​ సీట్స్- బై రూ. 187.2, స్టాప్​ లాస్​ రూ. 175, టార్గెట్​ రూ. 205

రెట్​గెయిన్​ ట్రావెల్​ టెక్నాలజీస్- బై రూ. 602.6, స్టాప్​ లాస్​ రూ. 575, టార్గెట్​ రూ. 660

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More