Stock Market today : పెరుగుతూనే ఉన్న చమురు ధర- స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? ఏ స్టాక్స్‌తో లాభాలు?
Stock market updates : ఏప్రిల్ 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్న సూచీలు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 77,304 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 195 పాయింట్లు వృద్ధిచెంది 24,093 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 56,264 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,152 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,124 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“ప్రస్తుతం మార్కెట్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. స్టాక్-స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకోవడం ఉత్తమం. ఎనర్జీ, మెటల్స్, ఫార్మా వంటి బలం కనిపిస్తున్న సెక్టార్లను ఎంచుకోవడం మంచిది. కానీ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి,” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎస్వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.13 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.12శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.20 వృద్ధిని చూసింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధర గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉంది. తాజాగా బ్రెంట్ క్రూడ్ 0.4శాతం పెరిగి బ్యారెల్‌కి 108.68 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 608
సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 570, టార్గెట్ రూ. 620
ఎన్ఎండీసీ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 87.8, టార్గెట్ రూ. 96
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జెన్ టెక్నాలజీస్- బై రూ. 1719.7, స్టాప్ లాస్ రూ. 1659, టార్గెట్ రూ. 1840
ఫోర్టిస్ హెల్త్‌కేర్- బై రూ. 953.8, స్టాప్ లాస్ రూ. 920, టార్గెట్ రూ. 1021
రైట్స్- బై రూ. 222.38, స్టాప్ లాస్ రూ. 214, టార్గెట్ రూ. 238
నైకా- బై రూ. 269.2, స్టాప్ లాస్ రూ. 259.7, టార్గెట్ రూ. 290
జేబీఎం ఆటో- బై రూ. 628.75, స్టాప్ లాస్ రూ. 606, టార్గెట్ రూ. 675
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


