మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 330 పాయింట్లు పడి 74,529 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 85 పాయింట్లు కోల్పోయి 23,329 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 255 పాయింట్లు పడి 56,216 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,809.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,120.07 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.36 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 పెద్దగా మారలేదు. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.45 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు పడింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 0.49శాతం పడి బ్యారెల్కు 99.94 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
స్విగ్గీ- బై రూ. 284, స్టాప్ లాస్ రూ. 270, టార్గెట్ రూ. 311
ఫినొలెక్స్ కేబుల్స్- బై రూ. 1468, స్టాప్ లాస్ రూ. 1395, టార్గెట్ రూ. 1610
{{/usCountry}}ఫినొలెక్స్ కేబుల్స్- బై రూ. 1468, స్టాప్ లాస్ రూ. 1395, టార్గెట్ రూ. 1610
{{/usCountry}}వెల్స్పన్ లివింగ్- బై రూ. 221, స్టాప్ లాస్ రూ. 211, టార్గెట్ రూ. 242
కార్బోరండమ్ యూనివర్సల్- బై రూ. 1211, స్టాప్ లాస్ రూ. 1150, టార్గెట్ రూ. 1325