Stock market : చమురు ధర ఢమాల్- స్టాక్ మార్కెట్లకు జోష్! ఈ 5 స్టాక్స్‌తో లాభాలు..
Stocks to buy today : జులై 27, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 332 పాయింట్లు పడి 76,060 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 102 పాయింట్లు కోల్పోయి 23,767 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 101 పాయింట్లు పెరిగి 56,693 వద్దకు చేరింది.

కాగా.. అమెరికా- ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా పరస్పర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ, గత వారాంతంలో ఈ దాడులు ఆగిపోయాయి. ఫలితంగా అప్పటివరకు అమాంతం పెరిగిపోయిన ముడి చమురు ధర ఇప్పుడు దిగొస్తోంది. ఫలితంగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,892.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,453.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. కాగా అమెరికా- ఇరాన్ మధ్య దాడులు ఆగిపోవడంతో అగ్రరాజ్య స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇక ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితుల మధ్య ముడి చమురు ధర భారీగా పతనమైంది. బ్రెంట్ క్రూడ్ ఏకంగా 5శాతం డౌన్ అయ్యి బ్యారెల్‌కు 92 డాలర్ల దిగువకు చేరింది.
స్టాక్స్ టు బై..
సిల్వర్ టచ్ టెక్నాలజీస్- బై రూ. 200, స్టాప్ లాస్ రూ. 190, టార్గెట్ రూ. 215
పీవీఆర్ ఐనాక్స్- బై రూ. 1064, స్టాప్ లాస్ రూ. 1003, టార్గెట్ రూ. 1150
జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2430, స్టాప్ లాస్ రూ. 2310, టార్గెట్ రూ. 2430
టీటీకే హెల్త్‌కేర్- బై రూ. 1047, స్టాప్ లాస్ రూ. 986, టార్గెట్ రూ. 1125
ఆసాహీ సోంగ్వాన్ కలర్స్- బై రూ. 333, స్టాప్ లాస్ రూ. 317, టార్గెట్ రూ. 355
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


