Stock market : 100 డాలర్లకు చేరువలో చమురు ధర- స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈరోజు కూడా నష్టాలే!
Crude oil price : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 366 పాయింట్లు పడి 76,391 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 23,870 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 535 పాయింట్లు పడి 56,592 వద్దకు చేరింది.
కాగా.. అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితులు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,999.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,947.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కిందకు పడుతూనే ఉంది. సూచీ ఇప్పుడు కీలకమైన 23,800 సపోర్ట్‌ని బ్రేక్ చేయ్యకుండా ఉండాలి. అదే కూడా విఫలమైతే.. నిఫ్టీ50 రానున్న సెషన్స్‌లో 23,000కి కూడా పడిపోవచ్చు,” అని ప్రభుదాస్ లిల్లాధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్ వైశాళి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.97 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.15 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
పశ్చిమాసియాలో అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర ఈ ఒక్క వారంగా లోనే 13.5శాతం పెరిగింది! ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఫ్లాట్‌గా 0.72శాతం పడి బ్యారెల్‌కి 99.97 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మాన్ ఇండస్ట్రీస్- బై రూ. 533, స్టాప్ లాస్- రూ. 520, టార్గెట్ రూ. 560
ఎస్టర్ ఇండస్ట్రీస్- బై రూ. 89, స్టాప్ లాస్ రూ. 87.5, టార్గెట్ రూ. 93
ఓరియంట్ ఎలక్ట్రిక్- బై రూ. 174, స్టాప్ లాస్ రూ. 171, టార్గెట్ రూ. 182
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


