Stock market : 95 డాలర్లు తాకిన ముడి చమురు ధర! ఈరోజు స్టాక్ మార్కెట్లకు నష్టాలే?
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 715 పాయింట్లు పడి 76,755 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 191 పాయింట్లు కోల్పోయి 23,996 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 709 పాయింట్లు పడి 57,127 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 819.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 418.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.01 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.14శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.57 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర అంతకంతకూ పెరిగిపోతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.58శాతం పెరిగి బ్యారెల్‌కి 95.5 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1307, స్టాప్ లాస్ రూ. 1250, టార్గెట్ రూ. 1400
గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా- బై రూ. 236, స్టాప్ లాస్ రూ. 222, టార్గెట్ రూ. 255
పాలీప్లెక్స్ కార్ప్- బై రూ. 1115, స్టాప్ లాస్ రూ. 1050, టార్గెట్ రూ. 1200
డివ్గీ టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టెమ్స్- బై రూ. 950, స్టాప్ లాస్ రూ. 900, టార్గెట్ రూ. 1025
ఏజిస్ లాజిస్టిక్స్- బై రూ. 1351, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ. 1450
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


