మళ్లీ 90 డాలర్లు దాటేసిన చమురు ధర- స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ బెస్ట్?

Stocks to buy today : జులై 20, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 20, 2026, 08:15:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 965 పాయింట్లు పెరిగి 78,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 262 పాయింట్లు వృద్ధిచెంది 24,334 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 939 పాయింట్లు పెరిగి 58,521 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 376.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,017.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మార్కెట్​లు పెరుగుతన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని, ట్రేడర్లు- మరీ ముఖ్యంగా బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.77 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.05శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.4 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ 2.71 శాతం పెరిగి బ్యారెల్​కి 90.49 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

వైభవ్ గ్లోబల్- బై రూ. 262, స్టాప్​ లాస్​ రూ. 245, టార్గెట్​ రూ. 285

భారత్ ఫోర్జ్- బై రూ. 2190, స్టాప్​ లాస్​ రూ. 2100, టార్గెట్​ రూ. 2350

ఏజిస్ లాజిస్టిక్స్- బై రూ. 1349, స్టాప్​ లాస్​ రూ. 1265, టార్గెట్​ రూ. 1450

ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్- బై రూ. 466, స్టాప్​ లాస్​ రూ. 442, టార్గెట్​ రూ. 500

ఎగ్సైడ్ ఇండస్ట్రీస్- బై రూ. 435, స్టాప్​ లాస్​ రూ. 415, టార్గెట్​ రూ. 460

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More