Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 182 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
Stocks to buy today : ఆగస్ట్ 7, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు పెరిగి 78,955 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,636 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 58,064 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 17.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,013.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,400- 24,450 లెవల్స్ కీలక సపోర్ట్‌గా, 24,750- 24,800 లెవల్స్ కీలక రెసిస్టెన్స్గానూ ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సూచీ మరింత పెరగొచ్చు. సపోర్ట్ బ్రేక్ అయితే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించవచ్చు,” అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.9 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.2శాతం పెరిగి బ్యారెల్‌కి 83.48 డాలర్ల వద్దకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కళ్యాన్ జ్యువెలర్స్ ఇండియా - బై రూ. 598, స్టాప్ లాస్ రూ. 577, టార్గెట్ రూ. 640
భారత్ డైనమిక్స్- బై రూ. 1299, స్టాప్ లాస్ రూ. 1255, టార్గెట్ రూ . 1390
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - బై రూ. 182.5, స్టాప్ లాస్ రూ. 176, టార్గెట్ రూ. 196
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్- బై రూ. 2599, స్టాప్ లాస్ రూ. 2510, టార్గెట్ రూ. 2770
బయోకాన్- బై రూ. 437, స్టాప్ లాస్ రూ. 421, టార్గెట్ రూ. 468
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


