Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఎస్బీఐ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
సెప్టెంబర్ 4, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు పడి 76,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు కోల్పోయి 23,873 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 209 పాయింట్లు పెరిగి 57,381 వద్దకు చేరింది.

ఈరోజు కృష్ణాష్టమి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంది కానీ స్టాక్ మార్కెట్లు మాత్రం యథావిథిగా కొనసాగుతాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,345.87 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,977.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.1 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.06శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.16 శాతం డౌన్ పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్‌లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కాప్లిన్ పాయింట్ లాబోరేటరీస్- బై రూ. 2845, స్టాప్ లాస్ రూ. 2745, టార్గెట్ రూ. 3044
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 408, స్టాప్ లాస్ రూ. 393, టార్గెట్ రూ. 437
ఎంసీఎక్స్- బై రూ. 3170, స్టాప్ లాస్ రూ. 3100, టార్గెట్ రూ. 3300
ఎస్బీఐ- బై రూ. 1028, స్టాప్ లాస్ రూ. 1015, టార్గెట్ రూ. 1055
ఐటీసీ హోటల్స్- బై రూ. 160, స్టాప్ లాస్ రూ. 155, టార్గెట్ రూ. 170
సెమిండియా ప్రాజెక్ట్స్ కంపెనీ- బై రూ. 1296, స్టాప్ లాస్ రూ. 1270, టార్గెట్ రూ. 1350
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 5270, స్టాప్ లాస్ రూ. 5180, టార్గెట్ రూ. 5500
జీఈ వెర్నోవా టీ అండ్ డీ ఇండియా- బై రూ. 4362, స్టాప్ లాస్ రూ. 4280, టార్గెట్ రూ. 4550
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 2267, స్టాప్ లాస్ రూ. 2137, టార్గెట్ రూ. 2460
మోరేపెని ల్యాబ్స్- బై రూ. 117.5, స్టాప్ లాస్ రూ. 109, టార్గెట్ రూ. 127
ఎంఎస్టీసీ - బై రూ. 744, స్టాప్ లాస్ రూ. 708, టార్గెట్ రూ. 805
విష్ణు కెమికల్స్- బై రూ. 688, స్టాప్ లాస్ రూ. 655, టార్గెట్ రూ. 745
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


