Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్..
Stocks to buy today : జులై 30, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 889 పాయింట్లు పెరిగి 77,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 265 పాయింట్లు వృద్ధిచెంది 24,250 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు పెరిగి 57,206 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,981.87 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 998.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.19 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.52శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.74 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ.. ముడి చమురు ధర పడుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.42శాతం పడి బ్యారెల్‌కి 89.45 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గ్లాండ్ ఫార్మా- బై రూ. 2544, స్టాప్ లాస్ రూ. 2434, టార్గెట్ రూ. 2720
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్- బై రూ. 612, స్టాప్ లాస్ రూ. 583, టార్గెట్ రూ. 650
మోరెపెన్ లాబ్స్- బై రూ. 57.8, స్టాప్ లాస్ రూ. 55, టార్గెట్ రూ. 61.5
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్- బై రూ. 645, స్టాప్ లాస్ రూ. 610, టార్గెట్ రూ. 690
హెక్సావేర్ టెక్నాలజీస్- బై రూ. 618, స్టాప్ లాస్ రూ. 582, టార్గెట్ రూ. 670
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


