Stock market today : మళ్లీ పెరిగి చమురు ధరలు- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు లాభాలా? నష్టాలా?
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
ఇరాన్- ఇజ్రాయెల్, యూఎస్ అనిశ్చితి మధ్య గత వారం అత్యంత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో కాస్త తేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 75,503 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 258 పాయింట్లు వృద్ధిచెంది 23,409 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 656 పాయింట్లు పెరిగి 54,413 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,365.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,593.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 66,248.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 83,120.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.183శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.01శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.22 శాతం పెరిగింది.
“నిఫ్టీ50కి 23,250- 23,300 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉంటాయి. 23,550- 23,600 వద్ద రెసిస్టెన్స్ ఉంది. ఆర్ఎస్ఐ అనేది ఓవర్‌సోల్డ్ నుంచి రికవరీ అవుతోంది. ఇంకా రికవర్ అయితే, సూచీలో బలాన్ని చూడవచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
ముడి చమురు ధరలు ఇలా..
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2శాతం పెరిగి ప్రస్తుతం 103.06 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అక్యుటాస్ కెమికల్స్- బై రూ. 2165, స్టాప్ లాస్ రూ. 2090, టార్గెట్ రూ. 2315
ఏథర్ ఇండస్ట్రీస్- బై రూ. 713, స్టాప్ లాస్ రూ. 688, టార్గెట్ రూ. 765
సాయి లైఫ్ సైన్సెస్- బై రూ. 976, స్టాప్ లాస్ రూ. 940, టార్గెట్ రూ. 1050
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 1470, స్టాప్ లాస్ రూ. 1420, టార్గెట్ రూ. 1570
సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా- బై రూ. 1043, స్టాప్ లాస్ రూ. 1005, టార్గెట్ రూ. 1120
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


