Stock market : 100 డాలర్లపైనే ముడి చమురు ధర- ఈరోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Brent Crude oil price : మార్చ్​ 16, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధరను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 16, 2026, 09:00:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లో బ్లడ్​ బాత్​ కొనసాగుతోంది. గత వారం రోజుల్లో సూచీలు అతి భారీ నష్టాలను చూశాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1470 పాయింట్లు పడి 74,564 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు పతనమై 23,151 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1343 పాయింట్లు కోల్పోయి 53,758 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

అంతర్జాతీయంగా గందరగోళం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27 సెన్సెక్స్​ సుమారు 81,200 వద్ద, నిఫ్టీ50 25,170 దగ్గర ఉండేవి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 10,716.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,977.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మార్చ్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 56,883.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 70,526.7 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 చార్ట్​లో శుక్రవారం లాంగ్​ బేర్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది వీక్​నెస్​కి చిహ్నం. ప్రస్తుతానికే సూచీ సపోర్ట్​ దగ్గర ఉంది. కానీ అక్కడి నుంచి రివర్సెల్​ని చూడొచ్చన్న కన్ఫర్మేషన్​ మాత్రం లేదు. ఇది మంచి విషయం కాదు. ఈ వారం సూచీలో 22,900 దగ్గర పుల్​బ్యాక్​ కనిపించాలి. అది జరగకపోతే నిఫ్టీ50 22,500- 22,000 లెవల్స్​ వరకూ కూడా వెళ్లొచ్చు. 23,500 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.26 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.61శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.93 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

ప్రపంచ చమురు సరఫరాకు జీవినాధారంగా భావించే హర్ముజ్​ జలసంధిపై సందిగ్ధత తొలగకపోవడం బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 100 డాలర్లపైనే కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 102.90 డాలర్ల వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

లుమాక్స్​ ఆటో టెక్నాలజీస్​- బై రూ. 1434, స్టాప్​ లాస్​ రూ. 1379, టార్గెట్​ రూ. 1537

థర్మల్​ లిమిటెడ్​- బై రూ. 3221, స్టాప్​ లాస్​ రూ. 2087, టార్గెట్​ రూ. 3447

స్టార్​ హెల్త్​ అండ్​ అలైడ్​ ఇన్సూరెన్స్​ కంపెనీ- బై రూ. 463, స్టాప్​ లాస్​ రూ. 443, టార్గెట్​ రూ. 500

మెడ్​ప్లస్​ హెల్త్​ సర్వీసెస్​- బై రూ. 850, స్టాప్​ లాస్​ రూ. 815, టార్గెట్​ రూ. 905

అలివస్​ లైఫ్​ సైన్సెస్​- బై రూ. 945, స్టాప్​ లాస్​ రూ. 915, టార్గెట్​ రూ. 1010

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More