Stock market : నెల రోజుల గరిష్ఠానికి చమురు ధర- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు!

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 14, 2026, 08:54:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 47 పాయింట్లు పెరిగి 77,616 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు వృద్ధిచెంది 24,211 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 58,132 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ముడి చమురు ధర నెల రోజుల గరిష్ఠానికి చేరడంతో ప్రపంచ స్టాక్​ మార్కెట్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు పడుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,062.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,171.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బిగినర్లు ట్రేడింగ్​కి దూరంగా ఉండటం ఉత్తమం అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.26 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.79శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.55 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ తాజా అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. బ్రెంట్​ క్రూడ్ 2శాతం పెరిగి బ్యారెల్​కి 84.98 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

యూపీఎల్- బై రూ. 592, స్టాప్ లాస్​ రూ. 585, టార్గెట్​ రూ. 610

కర్ణాటక బ్యాంక్- బై రూ. 279, స్టాప్​ లాస్​ రూ. 275, టార్గెట్​ రూ. 288

ఎన్​టీపీసీ- బై రూ. 350, స్టాప్​ లాస్​ రూ. 344, టార్గెట్​ రూ. 360

బ్రేకౌట్​ స్టాక్స్ టు బై..

వెల్​స్పన్ లివింగ్- బై రూ. 174, స్టాప్​ లాస్​ రూ. 163.5, టార్గెట్​ రూ. 188

పీసీబీఎల్ కెమికల్- బై రూ. 323.5, స్టాప్​ లాస్​ రూ. 310, టార్గెట్​ రూ. 350

టార్​సన్స్ ప్రాడక్ట్స్- బై రూ. 316, స్టాప్​ లాస్​ రూ. 300, టార్గెట్​ రూ. 340

సారేగామా ఇండియా- బై రూ. 498, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 540

నియోజెన్ కెమికల్స్- బై రూ. 2150, స్టాప్​ లాస్​ రూ. 2040, టార్గెట్​ రూ. 2323

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More