...
...
Next Story

Stock market : 80 డాలర్ల దిగువకు చమురు ధర- ఈరోజు స్టాక్​ మార్కెట్​లకు లాభాలా? నష్టాలా?

Stocks to buy today : జూన్ 23, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 23, 2026, 08:15:35 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 90 పాయింట్లు వృద్ధిచెంది 24,103 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 57,936 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 635.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,035.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 23,700 లెవల్స్​ బ్రేక్​ చేయనంత వరకు బై ఆన్ డిప్స్​ స్ట్రాటజీని అనుసరించాలని సూచిస్తున్నాము. సూచీకి 24,450- 24,600 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. బ్యాంకింగ్, ఆటో, రియాల్టీ, ఫార్మా, డిఫెన్స్​ రంగాల్లో స్టాక్స్​ని ఎంచుకోవచ్చు. ఐటీ స్టాక్స్​లో లాంగ్​ పొజిషన్స్​ని పెట్టుకోకపోవడం ఉత్తమం,” అని రెలిగేర్​ బ్రోకింగ్​కి చెందిన అజిత్ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.29 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.32 శాతం డౌన్​ అయ్యింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.19శాతం పెరిగి బ్యారెల్​కి 78.05 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

భారత్ ఫోర్జ్- బై రూ. 2104, స్టాప్​ లాస్​ రూ. 2030, టార్గెట్​ రూ. 2250

అదానీ గ్రీన్ ఎనర్జీ- బై రూ. 1550, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1650

వరుణ్ బేవరేజెస్- బై రూ. 513, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 540

జిందాల్ స్టీల్- బై రూ. 1132, స్టాప్​ లాస్​ రూ. 1110, టార్గెట్​ రూ. 1170

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పృథ్వీ స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 3656, స్టాప్​ లాస్​ రూ. 3470, టార్గెట్​ రూ. 4025

మహీంద్రా లాజిస్టిక్స్- బై రూ. 370, స్టాప్​ లాస్​ రూ .354, టార్గెట్​ రూ. 400

ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 392, స్టాప్​ లాస్​ రూ. 374, టార్గెట్​ రూ. 425

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe