శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1695 పాయింట్లు పెరిగి 75,528 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 461 పాయింట్లు వృద్ధిచెంది 23,623 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1638 పాయింట్లు పెరిగి 56,815 వద్దకు చేరింది.

కాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో చమురు ధరలు పడ్డాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,082.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,341.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
టెక్నికల్ ఎనలిస్టుల ప్రకారం.. నిఫ్టీ50 సూచీ కీలక 23,000 జోన్‌ని కాపాడుకోగలిగింది. అక్కడి నుంచి పెరిగింది. ఇంకా వృద్ధిని నమోదు చేయాలంటే కీలక 50-ఈఎంఏ లెల్ 23,800 దాటాలి
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.70 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.50శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.31 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం దాదాపు 4శాతం పతనమై బ్యారెల్‌కు 83.44 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ 54, స్టాప్ లాస్ రూ. 52.40, టార్గెట్ రూ. 58
ఎల్ అండ్ టీ ఫైనాన్స్- బై రూ. 272, స్టాప్ లాస్ రూ. 267, టార్గెట్ రూ. 282
ఐఓసీ- బై రూ. 140, స్టాప్ లాస్ రూ. 137, టార్గెట్ రూ. 148
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 1890, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 2070
ఎఫ్ఎస్ఎన్ ఈ కామార్స్ వెంచర్స్- బై రూ. 273, టార్గెట్ రూ. 295, స్టాప్ లాస్ రూ. 260
గ్రీవ్స్ కాటన్- బై రూ. 185, స్టాప్ లాస్ రూ. 175, టార్గెట్ రూ. 200
బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 678, స్టాప్ లాస్ రూ. 650, టార్గెట్ రూ. 740
రెయ్మాండ్స్- బై రూ. 580, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 630