Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఎన్టీపీసీ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్..
Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 719 పాయింట్లు పడి 73,524 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు పడి 54,064 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,555.67 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,165.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో వీక్నెస్ కనిపిస్తోంది. 23,100 లెవల్స్ దిగువకు వెళితే సూచీ మరింత బలహీన పడుతుంది. అక్కడి నుంచి 22,700కి వెళ్లొచ్చు. 23,250 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.16 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.86 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో చమురు ధర ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.14శాతం పెరిగి బ్యారెల్‌కి 94.38 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై టుడే..
కిమ్స్- బై రూ. 801, స్టాప్ లాస్ రూ. 772, టార్గెట్ రూ. 860
జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్- బై రూ. 148, స్టాప్ లాస్ రూ. 143, టార్గెట్ రూ. 159
టెక్ మహీంద్రా- బై రూ. 1503, స్టాప్ లాస్ రూ. 1485, టాార్గెట్ రూ. 1545
ఎన్టీపీసీ- బై రూ. 362, స్టాప్ లాస్ రూ. 354, టార్గెట్ రూ. 375
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బజాజ్ కన్జ్యూమర్- బై రూ. 575, స్టాప్ లాస్ రూ. 550, టార్గెట్ రూ. 630
షీలా ఫోమ్- బై రూ. 671, స్టాప్ లాస్ రూ .629, టార్గెట్ రూ. 735
కాప్లిన్ పాయింట్ ల్యాబ్- బై రూ. 2111, స్టాప్ లాస్ రూ. 2000, టార్గెట్ రూ. 2260
ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 2061, స్టాప్ లాస్ రూ. 1971, టార్గెట్ రూ. 2200
టాబ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్- బై రూ. 362, స్టాప్ లాస్ రూ. 343, టార్గెట్ రూ. 390
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


