Stock market : గిఫ్ట్ నిఫ్టీ డౌన్- ఈరోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..
Stocks to buy today : జూన్ 8, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
Gift nifty live : శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్లు పడి 74,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 23,367 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 188 పాయింట్లు పెరిగి 54,496 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,776.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,133.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు రేంజ్ బౌండ్లో కొనసాగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు ధరలు, టెక్ స్టాక్స్ పనితీరును ఇన్వెస్టర్లను నిశితంగా పరిశీలిస్తారు,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి చెందిన హెడ్ ఆఫ్ రీసెర్చ్, వెల్త్ మేనేజ్మెంట్ సిద్ధార్థ ఖేంక తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
టెక్ స్టాక్స్‌లో ప్రకంపనల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.35 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 2.6శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 4.18 శాతం డౌన్ అయ్యింది.
అమెరికా సూచీల్లో ప్రకంపనలు ఆసియా స్టాక్ మార్కెట్లకు పాకాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో సూచీల్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.5శాతం, కాస్పీ 8.4శాతం పతనమయ్యాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధర సోమవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 3.82శాతం పెరిగి బ్యారెల్‌కి 96.65 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
గ్రీవ్స్ కాటన్- బై రూ. 192.2, స్టాప్ లాస్ రూ. 181, టార్గెట్ రూ. 205
సారేగామా ఇండియా- బై రూ. 476, స్టాప్ లాస్ రూ. 454, టార్గెట్ రూ. 520
ఎన్ఆర్బీ బేరింగ్స్- బై రూ. 385, స్టాప్ లాస్ రూ. 270, టార్గెట్ రూ. 420
అపోలో పైప్స్- బై రూ. 498, స్టాప్ లాస్ రూ. 477, టార్గెట్ రూ. 540
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్- బై రూ. 1579, స్టాప్ లాస్ రూ. 1525, టార్గెట్ రూ. 1700
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


