Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 118 స్టాక్​​తో లాభాలకు ఛాన్స్!

Stock market updates : జూన్ 22, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 22, 2026, 08:14:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 607 పాయింట్లు పడి 76,803 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు కోల్పోయి 24,013 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 278 పాయింట్లు పడి 57,686 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,859.07 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,159.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​కు సెలవు. టాప్​ సూచీల ఫ్యూచర్స్​ మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ శాంతి చర్చల మధ్య ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.83శాతం వృద్ధిచెంది బ్యారెల్​కి 81.24 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

లెన్స్​కార్ట్- బై రూ. 510, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 530

హిందాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 1016, స్టాప్​ లాస్​ రూ. 1000, టార్గెట్​ రూ. 1045

హెచ్​డీఎఫ్​సీ లైఫ్- బై రూ. 593, స్టాప్​ లాస్​ రూ. 580, టార్గెట్​ రూ. 605

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఔరబిందో ఫార్మా- బై రూ. 1498, స్టాప్​ లాస్​ రూ. 1425, టార్గెట్​ రూ. 1635

సుప్రీమ్ పెట్రోకెమ్- బై రూ. 750, స్టాప్​ లాస్​ రూ. 715, టార్గెట్​ రూ. 820

విజయ డయగ్నోస్టిక్ సెంటర్- బై రూ. 1364, స్టాప్​ లాస్​ రూ. 1290, టార్గెట్​ రూ .1500

కేర్ రేటింగ్స్- బై రూ. 1713, స్టాప్​ లస్​ రూ. 1625, టార్గెట్​ రూ. 1890

వేలర్ ఎస్టేట్- బై రూ. 118, స్టాప్ లాస్​ రూ. 112.5, టార్గెట్​ రూ. 130

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More