సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 776 పాయింట్లు పెరిగి 76,836 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 23,996 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 394 పాయింట్లు పెరిగి 57,087 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,688.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,329.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.01 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.18 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, చర్చల సంకేతాల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కి 88 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నారాయణ హృదయాలయ- బై రూ. 2054, స్టాప్ లాస్ రూ. 1953, టార్గెట్ రూ. 2200
రికో ఆటో ఇండస్ట్రీస్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 139, టార్గెట్ రూ. 155
{{/usCountry}}రికో ఆటో ఇండస్ట్రీస్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 139, టార్గెట్ రూ. 155
{{/usCountry}}అప్కోటెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 585, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 635
360 వన్ వామ్- బై రూ. 1133, స్టాప్ లాస్ రూ. 1089, టార్గెట్ రూ. 1222
మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1659, స్టాప్ లాస్ రూ. 1585, టార్గెట్ రూ. 1777