Stock market : దిగొస్తున్న చమురు ధర- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్​తో లాభాలు..!

Stocks to buy today : జులై 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 28, 2026, 08:15:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 776 పాయింట్లు పెరిగి 76,836 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 23,996 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 394 పాయింట్లు పెరిగి 57,087 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,688.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,329.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.01 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.02శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.18 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, చర్చల సంకేతాల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్ బ్యారెల్​కి 88 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

నారాయణ హృదయాలయ- బై రూ. 2054, స్టాప్​ లాస్​ రూ. 1953, టార్గెట్​ రూ. 2200

రికో ఆటో ఇండస్ట్రీస్- బై రూ. 146, స్టాప్​ లాస్​ రూ. 139, టార్గెట్​ రూ. 155

అప్​కోటెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 585, స్టాప్​ లాస్​ రూ. 555, టార్గెట్​ రూ. 635

360 వన్ వామ్- బై రూ. 1133, స్టాప్​ లాస్​ రూ. 1089, టార్గెట్​ రూ. 1222

మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1659, స్టాప్​ లాస్​ రూ. 1585, టార్గెట్​ రూ. 1777

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More