stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 8 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్!

Stock market updates : జులై 16, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 16, 2026, 08:16:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 130 పాయింట్లు పెరిగి 77,185 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు వృద్ధిచెంది 24,078 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 57,758 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 704,93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 735.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.29 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.38శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.62 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ అనిశ్చితుల మధ్య ముడి చమురు ధర ఎక్కువగానే ఉంది. బ్రెంట్​ క్రూడ్ 0.4శాతం పెరిగి బ్యారెల్​కి 85.28 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

సీఈఎస్​సీ- బై రూ. 162, స్టాప్​ లాస్​ రూ. 158, టార్గెట్​ రూ. 168

వేదాంత- బై రూ. 260, స్టాప్​ లాస్​ రూ. 266, టార్గెట్​ రూ. 250

క్రిసిల్- బై రూ. 4190, స్టాప్​ లాస్​ రూ. 4170, టార్గెట్​ రూ. 4260

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

జుబీలియంట్ ఫార్మోవా- బై రూ. 1028, స్టాప్​ లాస్​ రూ. 977, టార్గెట్​ రూ. 1100

తమిళ్​నాడ్ మర్చెంటైల్ బ్యాంక్- బై రూ. 816, స్టాప్​ లాస్​ రూ. 777, టార్గెట్​ రూ. 875

చెన్నై పెట్రోలియం- బై రూ. 1157, స్టాప్​ లాస్​ రూ. 1105, టార్గెట్​ రూ. 1250

ఇండిగో పెయింట్స్- బై రూ. 1084, స్టాప్​ లాస్​ రూ. 1017, టార్గెట్​ రూ. 1165

జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరంగ్ వర్క్స్- బై రూ. 2448, స్టాప్​ లాస్​ రూ. 2330, టార్గెట్​ రూ. 2650.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More