Stock market : ట్రేడర్స్​ అలర్ట్- టీవీఎస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..!

Stocks to buy today : 29 జూన్ 2026, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 29, 2026, 08:15:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొహర్రం కారణంగా శుక్రవారం నాడు దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 109 పాయింట్లు పెరిగి 24,056 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 24,056 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 58,177 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 383.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,747.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.09 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.05శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.24 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

వారాంతంలో అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి అనిశ్చితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.67శాతం పెరిగి బ్యారెల్​కి 72.51 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఔరబిందో ఫార్మా- బై రూ. 1555, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1660

రాడికో ఖైతాన్- బై రూ. 3830, స్టాప్​ లాస్​ రూ. 3700, టార్గెట్​ రూ. 4090

ఇండస్ టవర్స్- బై రూ. 393, స్టాప్​ లాస్​ రూ. 382, టర్గెట్​ రూ. 415

కెనెరా బ్యాంక్- బై రూ. 129, స్టాప్​ లాస్​ రూ .123, టార్గెట్​ రూ. 140

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

మ్యాక్స్ హెల్త్​కేర్ ఇన్​స్టిట్యూట్- బై రూ. 1123, స్టాప్​ లాస్​ రూ. 1070, టార్గెట్​ రూ. 1220

టీవీఎస్ మోటార్ కంపెనీ- బై రూ. 3570, స్టాప్​ లాస్​ రూ. 2400, టార్గెట్​ రూ. 3880

ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 1722, స్టాప్​ లాస్​ రూ. 1650, టార్గెట్​ రూ. 1865

వెల్​స్పన్ కార్ప్- బై రూ. 1455, స్టాప్​ లాస్​ రూ. 1385, టార్గెట్​ రూ. 1590

పూనావాలా ఫిన్​కార్ప్- బై రూ. 440, స్టాప్​ లాస్​ రూ. 420, టార్గెట్​ రూ. 480

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More