...
...
Next Story

Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ రూ. 8.7 స్టాక్​కి టైమ్ వచ్చింది.. లాభాలకు ఛాన్స్!

ఆగస్టు 3, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 3, 2026, 08:15:45 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 166 పాయింట్లు పెరిగి 78,095 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 66 పాయింట్లు వృద్ధిచెంది 24,384 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 57,265 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 277.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,260.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.53 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.7శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1 శాతం జంప్ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై అగ్రరాజ్య అధ్యక్షుడు సానుకూల ప్రకటన చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడ్డాయి. బ్రెంట్​ క్రూడ్ ఫ్యూచర్స్ దాదాపు 6శాతం మేర పతనమై బ్యారెల్​కు సుమారు 82 డాలర్ల వద్దకు చేరింది.

స్టాక్స్​ టు బై..

టాటా పవర్- రూ .381, స్టాప్​ లాస్​ రూ. 373, టార్గెట్​ రూ. 393

హెచ్​డీఎఫ్​సీ ఏఎంసీ- బై రూ. 2600, స్టాప్​ లాస్​ రూ. 2550, టార్గెట్​ రూ. 2700

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ- బై రూ. 173, స్టాప్​ లాస్​ రూ. 165, టార్గెట్​ రూ. 190

గెయిల్- బై రూ. 181, స్టాప్​ లాస్​ రూ. 173, టార్గెట్​ రూ .197

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 256, స్టాప్​ లాస్​ రూ. 245, టార్గెట్​ రూ. 280

రామకృష్ణ ఫోర్జింగ్- బై రూ. 651, స్టాప్​ లాస్​ రూ. 620. టార్గెట్​ రూ. 711

చోలమండలం ఇన్వెస్ట్​మెంట్ అండ్ ఫిన్ - బై రూ. 1849, స్టాప్​ లాస్​ రూ. 1771, టార్గెట్​ రూ. 2018

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe