Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 8.7 స్టాక్‌కి టైమ్ వచ్చింది.. లాభాలకు ఛాన్స్!
ఆగస్టు 3, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు పెరిగి 78,095 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 66 పాయింట్లు వృద్ధిచెంది 24,384 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 57,265 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 277.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,260.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.53 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1 శాతం జంప్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై అగ్రరాజ్య అధ్యక్షుడు సానుకూల ప్రకటన చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ దాదాపు 6శాతం మేర పతనమై బ్యారెల్‌కు సుమారు 82 డాలర్ల వద్దకు చేరింది.
స్టాక్స్ టు బై..
రతన్ ఇండియా పవర్- బై రూ. 8.40, స్టాప్ లాస్ రూ. 7.40, టార్గెట్ రూ. 10.50
టాటా పవర్- రూ .381, స్టాప్ లాస్ రూ. 373, టార్గెట్ రూ. 393
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ- బై రూ. 2600, స్టాప్ లాస్ రూ. 2550, టార్గెట్ రూ. 2700
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ- బై రూ. 173, స్టాప్ లాస్ రూ. 165, టార్గెట్ రూ. 190
గెయిల్- బై రూ. 181, స్టాప్ లాస్ రూ. 173, టార్గెట్ రూ .197
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 256, స్టాప్ లాస్ రూ. 245, టార్గెట్ రూ. 280
రామకృష్ణ ఫోర్జింగ్- బై రూ. 651, స్టాప్ లాస్ రూ. 620. టార్గెట్ రూ. 711
చోలమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిన్ - బై రూ. 1849, స్టాప్ లాస్ రూ. 1771, టార్గెట్ రూ. 2018
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


