Stock market : స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్.. ఈ రూ. 103 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy today :  జూన్ 5, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 5, 2026, 08:14:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gift nifty live : గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 14 పాయింట్లు పెరిగి 74,360 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. కేవలం 11 పాయింట్లు వృద్ధిచెంది 23,417 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 54,308 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,447.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,360.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్, వెల్త్​ మేనేజ్​మెంట్​ సిద్ధార్థ ఖేంక ప్రకారం.. “భారత స్టాక్​ మార్కెట్​లు షార్ట్​ టర్మ్​లో రేంజ్​ బౌండ్​లోనే కొనసాగే అవకాశం ఉంది. కాగా ఈరోజు వెలువడనున్న ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్​ ఫలితాలపై మదుపర్లు ఫోకస్​ చేస్తన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, జీడీపీపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.”

ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్​కి సంబంధించిన ప్రెస్​ కాన్ఫరెన్స్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.73 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.41శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.09 శాతం డౌన్​ అయ్యింది.

టెక్​ ఇండెక్స్​ల పతనం కారణంగా ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాలను చూస్తున్నాయి. సౌత్​ కొరియాకు చెందిన కాస్పీ ఏకంగా 6శాతం పతనమైంది. జపాన్ నిక్కీ 2శాతం డౌన్ అయ్యింది.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర పెద్దగా మారలేదు. బ్రెంట్​ క్రూడ్ 0.22శాతం పడి బ్యారెల్​కి 95.24 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

ఐఎంఎఫ్​ఏ- బై రూ. 1530, స్టాప్ లాస్​ రూ. 1510, టార్గెట్​ రూ. 1590

ఎన్​బీసీసీ- బై రూ. 103, స్టాప్​ లాస్​ రూ. 100, టార్గెట్​ రూ. 108

అనుపమ్ రసాయన్- బై రూ. 1330, స్టాప్​ లాస్​ రూ. 1305, టార్గెట్​ రూ. 1370

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 1377, స్టాప్​ లాస్​ రూ. 1313, టార్గెట్ రూ. 1480

బ్లిస్ జీవీఎస్ ఫార్మా- బై రూ. 456, స్టాప్​ లాస్​ రూ. 430, టార్గెట్​ రూ. 499

ఎంటార్ టెక్నాలజీస్- బై రూ. 7755, స్టాప్​ లాస్​ రూ. 7310, టార్గెట్​ రూ. 8450

హొనాసా కన్జ్యూమర్- బై రూ. 417, స్టాప్​ లాస్​ రూ. 396, టార్గెట్​ రూ .450

కృష్ణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్- బై రూ. 765, స్టాప్​ లా స్​ రూ. 725, టార్గెట్​ రూ. 830

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More