stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలు!
Stock market updates : మే 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
Gift nifty live : సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1313 పాయింట్లు పడి 76,015 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 871 పాయింట్లు పడి 54,440 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,438 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,940 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌తో కూడిన భారీ బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఇది నెగిటివ్ ట్రెండ్‌కి సంకేతం. సూచీ ఇప్పుడు 23,800- 24,500 లెవల్స్ మధ్యలో కదలాడుతోంది. 23,800 నుంచి బౌన్స్ బ్యాక్ అయితే నిఫ్టీ50 పైకి వెళ్లొచ్చు. కిందకి బ్రేక్ అయితే 23,500- 23,200 లెవల్స్ వరకూ కూడా వెళ్లొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.19 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.19శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.10 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ముడి చమురు ధర ఈరోజు ఫ్లాట్‌గా ఉంది. బ్రెంట్ క్రూడ్ 0.29శాతం పెరిగి బ్యారెల్‌కి 104.51 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆక్మే సోలార్ హోల్డింగ్స్- బై రూ. 290, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 313
ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్- బై రూ. 2628, స్టాప్ లాస్ రూ. 2500, టార్గెట్ రూ. 2800
నాలేడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్- బై రూ. 2197, స్టాప్ లాస్ రూ. 2079, టార్గెట్ రూ. 2350
నారాయణ హృదయాలయ- బై రూ. 1886, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 2050
జేకే పేపర్- బై రూ. 391, స్టాప్ లాస్ రూ. 378, టార్గెట్ రూ. 420
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


