Stock Market : యూఎస్- ఇరాన్ చర్చలు విఫలం! చమురు ధర జంప్, స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
Stock market updates : మే 11, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
Sensex today : శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు పడి 77,328 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్లు పడి 55,311 వద్దకు చేరింది.

కాగా.. యుద్ధం ముగింపు, చమురు సరఫరా పునరుద్ధరణ కోసం ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయ్యాయన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,110.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,748.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 142 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 50ఈఎంఐ జోన్ అయిన 24,200 వద్ద కదులుతోంది. 23,800 కీలక సపోర్ట్‌గా ఉంది. 24,200 లెవల్ దాటితే సూచీ మరింత పెరగొచ్చు,” అని ప్రభుదాస్ లిల్లాధేర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలీ పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.02 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.84శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.7 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విచ్ఛిన్నం అవ్వడంతో బ్రెంట్ క్రూడ్ ఒక్కసారిగా 3.14శాతం పెరిగి బ్యారెల్‌కు 104.47 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మారెపెన్ ల్యాబ్స్- బై రూ. 45.70, స్టాప్ లాస్ రూ. 44, టార్గెట్ రూ. 48
రిలయన్స్- బై రూ. 1340, స్టాప్ లాస్ రూ. 1325, టార్గెట్ రూ. 1380
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 1050, స్టాప్ లాస్ రూ. 1035, టార్గెట్ రూ. 1070
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2599.90, స్టాప్ లాస్ రూ. 2490, టార్గెట్ రూ. 2800
కెన్స్ టెక్నాలజీ ఇండియా- బై రూ. 4507.50, స్టాప్ లాస్ రూ. 4300, టార్గెట్ రూ. 4900
టాటా కన్జ్యూమర్ ప్రాడక్ట్స్- బై రూ. 1176.20, స్టాప్ లాస్ రూ. 1125, టార్గెట్ రూ. 1275
వీఎస్టీ ఇండస్ట్రీస్- బై రూ. 264.40, స్టాప్ లాస్ రూ. 252, టార్గెట్ రూ. 285
రాడికో ఖైతాన్- బై రూ. 3477.2, స్టాప్ లాస్ రూ. 3320, టార్గెట్ రూ. 2800
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


