Stock market : చమురు ధర మళ్లీ జంప్! స్టాక్ మార్కెట్లకు నష్టాలు? కానీ ఈ స్టాక్స్‌తో లాభాలు..
Stocks to buy : మే 8, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పడి 77,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 24,327 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 66 పాయింట్లు పెరిగి 56,047 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 341 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 441 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.13 శాతం డౌన్ అయ్యింది.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 24,100- 24,150 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,500- 24,550 వద్ద కీల రెసిస్టెన్స్ ఉంది. రెండింటిలో ఏది బ్రేకౌట్ అయితే అటువైపు నిఫ్టీ50 డైరక్షన్ తీసుకోవచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.36శాతం పెరిగి బ్యారెల్‌కి 101.42 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఐఈఎక్స్- బై రూ. 132, స్టాప్ లాస్ రూ. 130, టార్గెట్ రూ. 138
కేఈసీ ఇంటర్నేషనల్- బై రూ. 600, స్టాప్ లాస్ రూ. 590, టార్గెట్ రూ. 625
సులా వైన్యార్డ్స్- బై రూ. 175, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 185
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 345.7, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 375
హీరో మోటోకార్ప్- బై రూ. 5343, స్టాప్ లాస్ రూ. 5130, టార్గెట్ రూ. 5750
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్- బై రూ. 4782, స్టాప్ లాస్ రూ. 4600, టార్గెట్ రూ .5125
క్రాంప్టన్ గ్రీవ్స్- బై రూ. 290.7, స్టాప్ లాస్ రూ. 280, టార్గెట్ రూ. 310
డెల్హివరీ- బై రూ. 481.7, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


