Stock market : స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్- చమురు ధర, స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy : జులై 17, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1 పాయింటు పెరిగి 77,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 6 పాయింట్లు కోల్పోయి 24,073 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్లు పడి 57,582 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,206 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,986 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50 సూచీ రేంజ్ బౌండ్లో ఉంది. ఇండెక్స్‌కి 24,000- 23,800 జోన్ కీలక సపోర్ట్గాను, 24,200 కీలక రెసిస్టెన్స్గాను ఉన్నాయి,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.20 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.51శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.47 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
శుక్రవారం ట్రేడంగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.27శాతం పెరిగి బ్యారెల్‌కి 85.30 డాలర్లకు చేరింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
బయోకాన్- రూ. 441, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 472
బీహెచ్ఈఎల్- బై రూ. 435.35, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 466
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 168, స్టాప్ లాస్ రూ. 164, టార్గెట్ రూ. 175
బీఈఎల్- బై రూ. 407, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 420
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
తాన్లా ప్లాట్ఫార్మ్స్- బై రూ. 588, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 635
ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్- బై రూ. 1206, స్టాప్ లాస్ రూ. 1150, టార్గెట్ రూ. 1300
ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 542, స్టాప్ లాస్ రూ. 516, టార్గెట్ రూ. 580
ఇన్పో ఎడ్జ్ ఇండియా- బై రూ. 1207, స్టాప్ లాస్ రూ. 1140, టార్గెట్ రూ. 1300
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్- బై రూ 1813, స్టాప్ లాస్ రూ. 1717, టార్గెట్ రూ. 1950
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


