ట్రేడర్స్​ అలర్ట్​- ఎస్బీఐ, ఎన్​టీపీసీ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

డిసెంబర్​ 10, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 10, 2025, 07:09:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 436 పాయింట్లు పడి 84,666 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు కోల్పోయి 25,840 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 16 పాయింట్లు పడి 59,222 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3760.08 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,224.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ​నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 14,819.29 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 28,552.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 సూచీ 21ఈఎంఏ దిగువకి పడింది. ఫలితంగా షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగివిట్​వా మారింది. సూచీ ఇక్కడి నుంచి 25,615- 25,535 వద్దకు చేరొచ్చు. 25,970- 26,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.38 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.09శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.13 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

యాప్టస్​ వాల్యూ హౌసింగ్​ ఫైనాన్స్​ ఇండియా- బై రూ. 289, స్టాప్​ లాస్​ రూ. 279, టార్గెట్​ రూ. 309

గుజరాత్​ పిపావావ్​ పోర్ట్​- బై రూ. 189, స్టాప్​ లాస్​ రూ. 182, టార్గెట్​ రూ. 203

గోద్రేజ్​ ప్రాపర్టీస్​- బై రూ. 2040, స్టాప్​ లాస్​ రూ. 2000, టార్గెట్​ రూ. 2120

ఎస్బీఐ- బై రూ. 960, స్టాప్​ లాస్​ రూ. 945, టార్గెట్​ రూ. 990

ఎన్​టీపీసీ- బై రూ. 318, స్టాప్​ లాస్​ రూ. 315, టార్గెట్​ రూ. 330

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

శారదా క్రాప్ కెమ్: రూ .908 వద్ద కొనండి, లక్ష్యం రూ .970, స్టాప్ లాస్ రూ .870;

సంధర్ టెక్నాలజీస్: రూ .560 వద్ద కొనండి, టార్గెట్ రూ .600, స్టాప్ లాస్ రూ .540;

ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్: రూ.260 వద్ద కొనండి, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.250;

జమ్నా ఆటో ఇండస్ట్రీస్: రూ .122.5 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;

ఆశాపురా మైన్ కెమ్: రూ .715 వద్ద కొనండి, లక్ష్యం రూ .765, స్టాప్ లాస్ రూ .688.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More