ట్రేడర్స్​ అలర్ట్​- ఇన్ఫోసిస్​, బ్యాంక్​ ఆఫ్​ బరోడా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 10, 2025, 07:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 95 పాయింట్లు పడి 83,216 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 17 పాయింట్లు కోల్పోయి 25,492 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 323 పాయింట్లు పెరిగి 57,877 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,581.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,674.77 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,632.66 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16,677.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 50ఈఎంఏ కింద ట్రేడ్​ అవుతోంది. ఇది షార్ట్​ టర్మ్​లో నెగిటివ్​! 25,400 వద్ద సపోర్ట్​ ఉంది. దాని కన్నా దిగువకు పడితే సెంటిమెంట్​ మరింత బేరిష్​గా మారొచ్చు. 25,600 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.16 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.13శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.21 శాతం డౌన్​ పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఇండియన్​ మెటల్​ అండ్​ ఫెర్రో అలాయ్స్​- బై రూ. 1197, స్టాప్​ లాస్​ రూ. 1150, టార్గెట్​ రూ. 1290

రాడికో ఖైతాన్​- బై రూ. 3310, స్టాప్​ లాస్​ రూ. 3200, టార్గెట్​ రూ. 3570

ఒబేరాయ్​ రియాల్టీ- బై రూ. 1786, స్టాప్​ లాస్​ రూ. 1750, టార్గెట్​ రూ. 1860

బ్యాంక్​ ఆఫ్​ బరోడా- బై రూ. 289, స్టాప్​ లాస్​ రూ. 282, టార్గెట్​ రూ. 305

ఇన్ఫోసిస్​- బై రూ. 1478, స్టాప్​ లాస్​ రూ. 1445, టార్గెట్​ రూ. 1520

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More