Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

ఫిబ్రవరి 11, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 11, 2026 8:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 208 పాయింట్లు పెరిగి 84,274 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 68 పాయింట్లు పెరిగి 25,935 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 43 పాయింట్లు పడి 60,626 వద్దకు చేరింది.

ఫిబ్రవరి 11- స్టాక్​ మర్కెట్​ అప్డేట్స్​..
ఫిబ్రవరి 11- స్టాక్​ మర్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 69.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,174.21 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,969.62 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,070.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.10 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.33శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.59 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

“25,790 వద్ద ఉన్న 50-డీఎంఏ.. నిఫ్టీ50కి కీలక సపోర్ట్​గా ఉంది. అది బ్రేక్​ అవ్వనంత వరకు సూచీ 26,000 వైపు వెళుతుంది. 26,000 దాటితే సూచీ 26,200 వరకు కూడా వెళ్లొచ్చు,” అని సెంట్రమ్​ ఫిన్​సర్వ్​ లిమిటెడ్​ హెడ్​ ఆఫ్​ టెక్నికల్​ అండ్​ డెరివేటివ్​ రీసెర్చ్​ నీలేశ్​ జైన్​ తెలిపారు.

బంగారం వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్​ గోల్డ్​ స్వల్ప లాభాలతో ఔన్సుకు 5,065 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. స్పాట్​ గోల్డ్​ 1.16శాతం పెరిగి ఔన్సుకు 81.32 డాలర్లకు చేరింది.

గరిష్ఠ స్థాయి (5,608.35 డాలర్ల) నుంచి బంగారం ధర దాదాపు 11శాతం దిగువన ఉంది. వెండి తన జీవితకాల గరిష్ఠం (121.67 డాలర్ల) నుంచి దాదాపు 50శాతం డౌన్​లో ఉంది.

స్టాక్స్​ టు బై..

టాటా స్టీల్​- బై రూ. 208, స్టాప్​ లాస్​ రూ. 200, టార్గెట్​ రూ. 224

భారత్​ ఫోర్జ్​- బై రూ. 1614, స్టాప్​ లాస్​ రూ. 1555, టార్గెట్​ రూ. 1732

టాటా టెక్నాలజీస్​- బై రూ. 630, స్టాప్​ లాస్​ రూ. 615, టార్గెట్​ రూ. 660

బీఈఎల్​- బై రూ. 438, స్టాప్​ లాస్​ రూ. 426, టార్గెట్​ రూ. 465

ఇన్పోసిస్​- బై రూ. 1495, స్టాప్​ లాస్​ రూ. 1465, టర్గెట్​ రూ. 1530

గేబ్రియల్​ ఇండియా- బై రూ. 998, స్టాప్​ లాస్​ రూ. 977, టార్గెట్​ రూ. 1050

అక్మే సోలార్​- బై రూ. 236.85, స్టాప్​ లాస్​ రూ. 231, టార్గెట్​ రూ. 250

సీడీఎస్​ఎల్​- బై రూ. 1400, స్టాప్​ లాస్​ రూ. 1370, టార్గెట్​ రూ. 1475

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More