ట్రేడర్స్ అలర్ట్- ఎటర్నల్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
నవంబర్ 11, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 83,535 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు వృద్ధిచెంది 25,574 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 57,938 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,114.85 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,805.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 5747.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22,483.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 25,500- 25,650 రేంజ్లో కదులుతోంది. 25,600- 25,650 లెవల్స్ దాటితేనే అప్‌ట్రెండ్ కనిపిస్తుంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.81 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.54శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.27 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
లారెస్ ల్యాబ్స్- బై రూ. 1001, స్టాప్ లాస్ రూ. 966, టార్గెట్ రూ. 1071
టోరెంట్ ఫార్మా- బై రూ. 3818, స్టాప్ లాస్ రూ. 3685, టార్గెట్ రూ. 4084
సన్ ఫార్మా- బై రూ. 1698, స్టాప్ లాస్ రూ. 1670, టార్గెట్ రూ. 1735
హిందాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 786, స్టాప్ లాస్ రూ. 770, టార్గెట్ రూ. 820
ఎటర్నల్- బై రూ 303, స్టాప్ లాస్ రూ. 296, టార్గెట్ రూ. 316
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్: రూ.1087, టార్గెట్ రూ.1164, స్టాప్ లాస్ రూ.1049;
జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్: రూ .1813 వద్ద కొనండి, రూ .1940 టార్గెట్, స్టాప్ లాస్ రూ .1750;
ఏఐఏ ఇంజనీరింగ్: రూ .3444 వద్ద కొనండి, టార్గెట్ రూ .3680, స్టాప్ లాస్ రూ .3326;
ఆవాస్ ఫైనాన్షియర్స్: రూ .1648 వద్ద కొనండి, లక్ష్యం రూ .1764, స్టాప్ లాస్ రూ .1590;
ఎమ్ క్యూర్ ఫార్మాస్యూటికల్స్: రూ .1422 వద్ద కొనండి, రూ .1522 కు టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .1372.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


