ట్రేడర్స్ అలర్ట్- ఈ రోజు స్టాక్ మార్కెట్‌కు లాభాలు.. ఈ 10 స్టాక్స్‌తో ప్రాఫిట్‌కి ఛాన్స్!
డిసెంబర్ 12, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు పెరిగి 84,818 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 141 పాయింట్లు వృద్ధిచెంది 25,899 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 249 పాయింట్లు పెరిగి 59,210 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,020.94 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,7960.07 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 18,491.29 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,101.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి షార్ట్ టర్మ్‌లో 25,700 వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే బేరిష్‌గా మారొచ్చు. 26,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే బుల్లిష్ సెంటిమెంట్ కనిపించవచ్చు,” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 1.34 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.34శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.25 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
జామ్నా ఆటో- బై రూ. 125.5, స్టాప్ లాస్ రూ. 121, టార్గెట్ రూ. 134.5
జీవీటీ అండ్ డీ- బై రూ. 2998, స్టాప్ లాస్ రూ. 2750, టార్గెట్ రూ. 2895
గ్రాసిమ్- బై రూ. 2795, స్టాప్ లాస్ రూ. 2750, టార్గెట్ రూ. 2880
యూనియన్ బ్యాంక్- బై రూ. 150, స్టాప్ లాస్ రూ. 145, టార్గెట్ రూ. 158
ఎం అండ్ ఎం- బై రూ. 3665, స్టాప్ లాస్ రూ. 3600, టార్గెట్ రూ. 3790
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
యాత్ర ఆన్లైన్: రూ .180 వద్ద కొనండి, టార్గెట్ రూ .194, స్టాప్ లాస్ రూ .173;
నాట్కో ఫార్మా: రూ .914 వద్ద కొనండి, లక్ష్యం రూ .980, స్టాప్ లాస్ రూ .880;
సాకార్ హెల్త్ కేర్: రూ.421, టార్గెట్ రూ.460, స్టాప్ లాస్ రూ.410;
రామ్కో సిస్టమ్స్: రూ .654 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .700, స్టాప్ లాస్ రూ .630;
ప్రతాప్ స్నాక్స్: రూ .1085 వద్ద కొనండి, టార్గెట్ రూ .1170, స్టాప్ లాస్ రూ .1050.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


