స్టాక్​ మార్కెట్​ అలర్ట్​! ప్రీ- ఓపెన్​ సెషన్​లో కీలక మార్పు.. ఇది తెలుసుకోండి

డిసెంబర్ 8 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ (ఎఫ్​ అండ్​ ఓ) ట్రేడింగ్‌లో కీలక మార్పు కనిపించబోతోంది. ఎఫ్​ అండ్​ ఓలో ప్రీ-ఓపెన్ సెషన్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీటైల్డ్​గా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 8, 2025, 05:34:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిసెంబర్ 8, సోమవారం నుంచి, ఈక్విటీ డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో మార్కెట్ కొత్తగా ‘ప్రీ-ఓపెన్ సెషన్’ను ప్రారంభించనుంది. ఈ కొత్త విధానం వ్యక్తిగత స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ రెండింటికీ వర్తిస్తుందని నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) తెలిపింది.

స్టాక్​ మార్కెట్​ అలర్ట్​..
స్టాక్​ మార్కెట్​ అలర్ట్​..

ప్రీ-ఓపెన్​ సెషన్​- సమయం, విధానం..

ఎన్​ఎస్​ఈ సమాచారం ప్రకారం, స్టాక్​ మార్కెట్​లో ఈ ప్రీ-ఓపెన్ సెషన్ 15 నిమిషాల పాటు, అంటే ఉదయం 9:00 గంటల నుంచి 9:15 గంటల వరకు 'కాల్ ఆక్షన్' పద్ధతిలో జరుగుతుంది.

15 నిమిషాల సెషన్‌లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.

1. ఆర్డర్ ఎంట్రీ పీరియడ్

సమయం: ఉదయం 9:00 గంటల నుంచి 9:08 గంటల వరకు.

ఏం చేయవచ్చు?: ఈ సమయంలో ట్రేడర్లు తమ ఆర్డర్లను సమర్పించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు కూడా.

ముఖ్య గమనిక: 7వ నిమిషం నుంచి 8వ నిమిషం మధ్యలో, సిస్టమ్ ర్యాండమ్లీ టైమ్డ్​ క్లోజర్​ని అమలు చేస్తుంది. సాధారణ ఈక్విటీస్ ప్రీ-ఓపెన్ సెషన్‌కు, ఈక్విటీ డెరివేటివ్స్ ప్రీ-ఓపెన్ సెషన్‌కు ఈ ముగింపు సమయం వేర్వేరుగా ఉంటుంది.

2. ఆర్డర్ మ్యాచింగ్, ట్రేడ్ కన్ఫర్మేషన్

సమయం: ఉదయం 9:08 గంటల నుంచి 9:12 గంటల వరకు.

ఏం జరుగుతుంది?: ఆర్డర్ ఎంట్రీ సమయం ముగిసిన వెంటనే, ఆర్డర్ల మ్యాచింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సిస్టమ్ ఈ సమయంలో ‘ఈక్విలిబ్రియన్​ ప్రైజ్​’ ఆధారంగా ఓపెనింగ్ ధరను లెక్కించి, దానికి సరిపోయే ఆర్డర్లను ఎగ్జిక్యూట్ చేస్తుంది.

3. బఫర్ పీరియడ్

సమయం: ఉదయం 9:12 గంటల నుంచి 9:15 గంటల వరకు.

ఉపయోగం: ఇది కేవలం ఒక బఫర్ పీరియడ్​. ఈ సమయంలో మార్కెట్ ప్రీ-ఓపెన్ దశ నుంచి సాధారణ నిరంతర ట్రేడింగ్ సెషన్​లోకి మారుతుంది.

ట్రేడింగ్ నియమాలు..

ప్రీ-ఓపెన్ సెషన్‌ను ముఖ్యంగా రెండు దశలుగా విభజించారు:

ఆర్డర్ కలెక్షన్ పీరియడ్:

ఈ దశలో ట్రేడర్లు ఆర్డర్లను వేయడం, మార్చడం లేదా రద్దు చేయడం చేయవచ్చు.

లిమిట్ ఆర్డర్లు, మార్కెట్ ఆర్డర్ల రెండింటికి అనుమతి ఉంటుంది.

అయితే స్టాప్-లాస్, ఐఓసీ వంటి ప్రత్యేక ఆర్డర్ రకాలకు అనుమతి ఉండదు.

ట్రేడర్లు రియల్ టైమ్ సూచిక ధరలు, సమతుల్యత లెక్కలు, డిమాండ్-సరఫరా వివరాలను కూడా చూడవచ్చు.

ఆర్డర్ మ్యాచింగ్ పీరియడ్:

ఈ దశలో ఎక్స్​ఛేంజ్ ఒకే సమతుల్య ధరను నిర్ణయిస్తుంది. అదే మార్కెట్ ఓపెనింగ్ ధర అవుతుంది.

ఆర్డర్లు ఒక నిర్ణీత క్రమంలో మ్యాచింగ్ అవుతాయి. మొదట లిమిట్ ఆర్డర్లు, ఆపై మిగిలిన లిమిట్ ఆర్డర్లు మార్కెట్ ఆర్డర్లతో, చివరగా మార్కెట్ ఆర్డర్లు ఒకదానితో ఒకటి మ్యాచింగ్ చేయడం జరుగుతుంది.

ఈ దశలో, ఆర్డర్లలో మార్పులు లేదా రద్దులకు అనుమతి లేదు.

మార్జిన్ నిబంధనలు

ప్రీ-ఓపెన్ సెషన్‌లో ఉంచిన అన్ని ఆర్డర్లకు తగినంత మార్జిన్ ఉందో లేదో ముందుగానే తనిఖీ చేస్తారు. ఒకవేళ ట్రేడర్‌కు మార్జిన్ అవసరానికి సరిపడా పెట్టుబడి లేకపోతే, ఆ ఆర్డర్‌ను ప్రీ-ఓపెన్ సెషన్‌కు తిరస్కరించడం జరుగుతుందని ఎన్​ఎస్​ఈ స్పష్టం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More