ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 10 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​!

నవంబర్​ 12, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 12, 2025 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళరం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 336 పాయింట్లు పెరిగి 83,871 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు వృద్ధిచెంది 25,695 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 201 పాయింట్లు పెరిగి 58,138 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 803.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,188.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 6550.73 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 24,671.67 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది. 26,000 టార్గెట్​! 25,600 వద్ద సపోర్ట్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.1 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.21శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.25 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

అశోక్​ లేల్యాండ్​- బై రూ. 146, స్టాప్​ లాస్​ రూ. 141, టార్గెట్​ రూ. 156

నెల్కో- బై రూ. 265.66, స్టాప్​ లాస్​ రూ. 256, టార్గెట్​ రూ. 285

హుడ్​కో- బై రూ. 230, స్టాప్​ లస్​ రూ. 22, టార్గెట్​ రూ. 243

ఎస్బీఐ కార్డ్స్​ అండ్​ పేమెంట్స్​ సర్వీసెస్​- బై రూ. 864, స్టాప్​ లాస్​ రూ. 845, టార్గెట్​ రూ. 895

ఓఎన్​జీసీ- బై రూ. 249, స్టాప్​ లాస్​ రూ. 243, టార్గెట్​ రూ. 262

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

యాత్ర ఆన్ లైన్: రూ .165 వద్ద కొనండి, టార్గెట్ రూ .177, స్టాప్ లాస్ రూ .158;

ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .616 వద్ద కొనండి, లక్ష్యం రూ .660, స్టాప్ లాస్ రూ .595;

లాటెంట్ వ్యూ అనలిటిక్స్: రూ .485 వద్ద కొనండి, టార్గెట్ రూ .520, స్టాప్ లాస్ రూ .466;

అవ్ఫిస్ స్పేస్ సొల్యూషన్స్: రూ .630 వద్ద కొనండి, టార్గెట్ రూ .675, స్టాప్ లాస్ రూ .605;

కేపీఆర్ మిల్లు: రూ.1094కు కొనండి, టార్గెట్ రూ.1180, స్టాప్ లాస్ రూ.1055.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

News/News/ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 10 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​!
News/News/ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 10 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​!