గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్లు పెరిగి 84,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 3 పాయింట్లు వృద్ధిచెంది 25,879 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 58,382 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 383.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,091.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 8,684.44 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 32,890.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 26000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 26,200- 26,350 వరకు ర్యాలీ అవ్వొచ్చు. 25,800 వద్ద సపోర్ట్ ఉంది. దాని కన్నా దిగువకు పడితే ర్యాలీ కోల్పోయినట్టు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. ప్రాఫిట్ బుకింగ్ ఇందుకు కారణం. డౌ జోన్స్ 1.65 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.66శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.29 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆవాస్ ఫైనాన్షియర్స్- బై రూ. 1736, స్టాప్ లాస్ రూ. 1675, టార్గెట్ రూ. 1858
వేదాంత- బై రూ. 530, స్టాప్ లాస్ రూ. 511, టార్గెట్ రూ. 568
ఎన్టీపీసీ- బై రూ. 326, స్టాప్ లాస్ రూ. 316, టార్గెట్ రూ. 342
బీఈఎల్- బై రూ. 419, స్టాప్ లాస్ రూ. 408, టార్గెట్ రూ. 435
మారుతీ సుజుకీ- బై రూ. 16750, స్టాప్ లాస్ రూ. 16400, టార్గెట్ రూ. 17,100
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్: రూ .200 వద్ద కొనండి, రూ .215 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .193;
గోల్డియం ఇంటర్నేషనల్: రూ .390 వద్ద కొనండి, లక్ష్యం రూ .420, స్టాప్ లాస్ రూ .376;
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్: రూ .285 వద్ద కొనండి, టార్గెట్ రూ .305, స్టాప్ లాస్ రూ .276;
కరారో ఇండియా: రూ .531 వద్ద కొనండి, టార్గెట్ రూ .570, స్టాప్ లాస్ రూ .515;
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .524 వద్ద కొనండి, రూ .560 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .505.