ట్రేడర్స్​ అలర్ట్​- టీసీఎస్​, ఎటర్నల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

డిసెంబర్​ 15, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 15, 2025, 08:15:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 450 పాయింట్లు పెరిగి 85,268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్లు వృద్ధిచెంది 26,047 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 59,390 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,114.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,868.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 19,605.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 39,970.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 26,000 లెవల్స్​ దాటడం సానుకూల విషయం. 21ఈఎంఏని కూడా దాటింది. సూచీకి 25,900 కీలక సపోర్ట్​గా, 26,300 కీలక రెసిస్టెన్స్​గా ఉండే అవకాశం ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.10 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.07 శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.69 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

వేదాంత- బై రూ. 543, స్టాప్​ లాస్​ రూ. 524, టార్గెట్​ రూ. 581

అశోక్​ లేల్యాండ్​- బై రూ. 164, స్టాప్​ లాస్​ రూ. 158, టార్గెట్​ రూ. 176

జుబీలియంట్​ ఫుడ్​- బై రూ. 583, స్టాప్​ లాస్​ రూ. 570, టార్గెట్​ రూ. 610

ఐటీసీ- బై రూ. 400, స్టాప్​ లాస్​ రూ. 395, టార్గెట్​ రూ. 410

టీసీఎస్​- బై రూ. 3220, స్టాప్​ లాస్​ రూ. 3160, టార్గెట్​ రూ. 3300

ఎటర్నల్​ (జొమాటో)- బై రూ. 298, స్టాప్​ లాస్​ రూ. 291, టార్గెట్​ రూ. 320

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్: రూ.274 వద్ద కొనండి, టార్గెట్ రూ.295, స్టాప్ లాస్ రూ.264;

అట్లాంటా ఎలక్ట్రికల్స్: రూ .925 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .990, స్టాప్ లాస్ రూ .890;

జోటా హెల్త్ కేర్: రూ.1670 వద్ద కొనండి, టార్గెట్ రూ.1800, స్టాప్ లాస్ రూ.1600;

సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా): రూ.1025 వద్ద కొనండి, టార్గెట్ రూ.1100, స్టాప్ లాస్ రూ.988;

సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .786 వద్ద కొనండి, రూ .850 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .760.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More