శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు పడి 78,009 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు కోల్పోయి 24,366 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు పడి 57,491 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 508.12 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 356.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.20 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.28 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర ఎక్కువగానే ఉంది! బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
హెచ్ఏఎల్- బై రూ. 5030, స్టాప్ లాస్ రూ. 4799, టార్గెట్ రూ. 5500
గోద్రేజ్ అగ్రోవెట్- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 620
{{/usCountry}}గోద్రేజ్ అగ్రోవెట్- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 620
{{/usCountry}}అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్- బై రూ. 8920, స్టాప్ లాస్ రూ. 8850, టార్గెట్ రూ. 9100
ఎటర్నల్- బై రూ. 318, స్టాప్ లాస్ రూ. 310, టార్గెట్ రూ. 332
విప్రో- బై రూ. 184, స్టాప్ లాస్ రూ. 180, టార్గెట్ రూ. 192
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ సీఎంపీ- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 291, టార్గెట్ రూ. 320
ఎయిరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 459.8, స్టాప్ లాస్ రూ. 449, టార్గెట్ రూ. 485
హావెల్స్ ఇండియా- బై రూ. 1298, స్టాప్ లాస్ రూ. 1272, టార్గెట్ రూ. 1370
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 2532, స్టాప్ లాస్ రూ. 2380, టార్గెట్ రూ. 2750
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 503, స్టాప్ లాస్ రూ. 466, టార్గెట్ రూ. 550
సువెన్ లైఫ్ సైన్సెస్- బై రూ. 342, స్టాప్ లాస్ రూ. 322, టార్గెట్ రూ. 370