ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 122 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​..

డిసెంబర్​ 17, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ఈ రోజు మార్కెట్​ ఎలా ఉండబోతోంది? వంటి విషయాలపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 17, 2025, 08:01:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 533 పాయింట్లు పడి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 427 పాయింట్లు పెరిగి 59,035 వద్దకు చేరింది.

లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,381.92 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,077.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 23,455.75 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 42,839.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,720 వద్ద సపోర్ట్​ ఉంది. అది బ్రేక్​ అయితే సూచీ 25,650- 25,600 వరకు వెళ్లొచ్చు. ఇక 26,000- 26,050 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే కానీ బుల్లిష్​ మూమెంట్​ రాదు,” అని సామ్​కో సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ ఓం మెహ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.62 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.24శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.23 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సిల్వర్ టచ్ టెక్నాలజీస్: రూ.878, టార్గెట్ రూ.945, స్టాప్ లాస్ రూ.850;

ప్రికోల్: రూ .632 వద్ద కొనండి, టార్గెట్ రూ .680, స్టాప్ లాస్ రూ .610;

రికో ఆటో ఇండస్ట్రీస్: రూ .122.7 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;

అవంతి ఫీడ్స్: రూ .827 వద్ద కొనండి, టార్గెట్ రూ .888, స్టాప్ లాస్ రూ .800;

సుప్రజిత్ ఇంజినీరింగ్: రూ .460 వద్ద కొనండి, టార్గెట్ రూ .495, స్టాప్ లాస్ రూ .444.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More