గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 862 పాయింట్లు పెరిగి 83,468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 262 పాయింట్లు వృద్ధిచెంది 25,585 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 623 పాయింట్లు పెరిగి 57,422 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 997.29 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,076.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 895.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,517.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“కీలక 25,500 రెసిస్టెన్స్ లెవల్స్‌ని నిఫ్టీ50 అదిగమించింది. ఇక్కడ నుంచి సూచీ 25,750- 25,800 వరకు వెళ్లొచ్చు. 25,500 సపోర్ట్‌గా మారుతుంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.65 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.63శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.47 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}డా. అగర్వాల్స్ హెల్త్ కేర్- బై రూ. 541.5, స్టాప్ లాస్ రూ. 523, స్టాప్ లాస్ రూ. 579
ఏథర్ ఎనర్జీ- బై రూ. 688.5, స్టాప్ లాస్ రూ. 665, టార్గెట్ రూ. 736
సెయిల్- బై రూ .131, స్టాప్ లాస్ రూ. 125, టార్గెట్ రూ. 140
ఎం అండ్ ఎం- బై రూ. 3560, స్టాప్ లాస్ రూ. 3250, టార్గెట్ రూ. 3750
కేపీఐటీ టెక్నాలజీస్- బై రూ. 1162, స్టాప్ లాస్ రూ. 1140, టార్గెట్ రూ. 1200
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1415, స్టాప్ లాస్ రూ. 1390, టార్గెట్ రూ. 1470
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.286, టార్గెట్ రూ.305, స్టాప్ లాస్ రూ.275;
ప్రివి స్పెషాలిటీ కెమికల్స్: రూ.2744 వద్ద కొనండి, టార్గెట్ రూ.2940, స్టాప్ లాస్ రూ.2640;
హిండ్ వేర్ హోమ్ ఇన్నోవేషన్: రూ .371 వద్ద కొనండి, టార్గెట్ రూ .400, స్టాప్ లాస్ రూ .360;
రామ్కో సిస్టమ్స్: రూ.582, టార్గెట్ రూ.625, స్టాప్ లాస్ రూ.560;
ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్: రూ .2932 వద్ద కొనండి, టార్గెట్ రూ .3150, స్టాప్ లాస్ రూ .2828