శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు పెరిగి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 29 పాయింట్లు వృద్ధిచెంది 25,694 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 515 పాయింట్లు పెరిగి 60,095 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,346.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,935.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 26,052.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 34,076.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,500- 25,450 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది. 25,875- 25,900 జోన్ రెసిస్టెన్స్‌గా ఉంది. ఈ రెండింటిలో ఏది బ్రేక్ అయినా సూచీ అటువైపు బలంగా కదలి అవకాశం ఉంది,” అని ఏంజిల్ వన్‌కి చెందిన చీఫ్ మేనేజర్- టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఓషో కృష్ణన్ తెలిపారు.
- Reliance share : క్యూ3 ఫలితాల తర్వాత రిలయన్స్ స్టాక్ డౌన్? కొనాలా? అమ్మేయాలా? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.17 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.06శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.06 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.17 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.06శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.06 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 1025, స్టాప్ లాస్ రూ. 990, టార్గెట్ రూ. 1100
ఎల్టీఐ మైండ్‌ట్రీ- బై రూ. 6308, స్టాప్ లాస్ రూ. 6100, టార్గెట్ రూ. 6750
ఐఈఎక్స్- బై రూ. 140, స్టాప్ లాస్ రూ. 124, టార్గెట్ రూ. 152
చోలమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్- బై రూ. 1700, స్టాప్ లాస్ రూ. 1670, టార్గెట్ రూ. 1750
భారతీ ఎయిర్టెల్- బై రూ. 2015, స్టాప్ లాస్ రూ. 2000, టార్గెట్ రూ. 2150
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
యూపీఎల్- బై రూ. 790.15, స్టాప్ లాస్ రూ. 761
టెక్ మహీంద్రా- బై రూ. 1670.50, స్టాప్ లాస్ రూ. 1600, టార్గెట్ రూ. 1815
బ్యాంక్ ఆప్ బరోడా- బై రూ. 308.25, స్టాప్ లాస్ రూ. 295, టార్గెట్ రూ. 330
జేఎస్‌డబ్ల్యూ స్టీల్- బై రూ. 1187, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1280
గ్రాసిమ్ ఇండస్ట్రీస్- బై రూ. 2809, స్టాప్ లాస్ రూ. 2700, టార్గెట్ రూ. 3000