Reliance share : క్యూ3 ఫలితాల తర్వాత రిలయన్స్ స్టాక్ డౌన్? కొనాలా? అమ్మేయాలా?
రిలయన్స్ ఇండిస్ట్రీస్ క్యూ3 ఫలితాల అనంతరం లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కంపెనీ జీడీఆర్ 2% మేర పతనమైంది. సోమవారం భారత మార్కెట్లో షేరు ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు రిలయన్స్ స్టాక్ కొనొచ్చా? ఇక్కడ తెలుసుకోండి..
గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్ట్రీస్ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రభావం అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రిలయన్స్ గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) సుమారు 2 శాతం క్షీణించి 64.40 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతేకాదు ఇండియా స్టాక్ మార్కెట్లో సోమవారం రిలయన్స్ స్టాక్ నెగిటివ్‌లో ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి క్యూ3 ఫలితాల అనంతరం రిలయన్స్ స్టాక్‌ని ఇప్పుడు కొనొచ్చా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..

రిలయన్స్ క్యూ3 ఫలితాలు: పెరిగిన ఆదాయం.. జియో, రిటైల్ జోరు
చమురు నుంచి టెలికాం వరకు విస్తరించిన ఈ దిగ్గజ సంస్థ, ఎఫ్వై26 క్యూ3లో ఏకీకృత నికర లాభంలో వార్షిక ప్రాతిపదికన 2 శాతం వృద్ధిని సాధించి రూ. 22,167 కోట్లు ఆర్జించింది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 10.51 శాతం పెరిగి రూ. 2,69,496 కోట్లకు చేరింది.
రిలయన్స్ జియో ఆదాయం 12.7 శాతం పెరగ్గా, లాభం 11.2 శాతం వృద్ధి చెంది రూ. 7,629 కోట్లుగా నమోదైంది.
రిలయన్స్ రిటైల్ విభాగం రూ. 86,951 కోట్ల ఆదాయంతో 9.2 శాతం వృద్ధిని కనబరిచింది.
"రిలయన్స్ ఫలితాల పట్ల లండన్ మార్కెట్ ఇన్వెస్టర్లు అంత సంతృప్తిగా లేరని జీడీఆర్ ధర పతనం సూచిస్తోంది. ఇదే సెంటిమెంట్ సోమవారం భారత మార్కెట్లలోనూ ప్రతిబింబించవచ్చు. రిలయన్స్ షేర్లు ఫ్లాట్‌గా లేదా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది," అని కాంతీలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ ఏవీపీ మహేష్ ఎం ఓజా వివరించారు.
ఓ2సీ విభాగం: ఆదాయం 8.4 శాతం పెరిగి రూ. 1,62,095 కోట్లకు చేరినప్పటికీ, ఎగుమతులు 1.2 శాతం తగ్గాయి.
ఎబిట్డా: 6.1 శాతం వృద్ధితో రూ. 50,932 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు స్వల్పంగా 70 బేసిస్ పాయింట్లు తగ్గాయి.
రిలయన్స్ స్టాక్‌ని కొనాలా.. అమ్మాలా?
సాధారణంగా ఫలితాల తర్వాత రిలయన్స్ షేర్లు కొంత మేర తగ్గినప్పటికీ, మళ్లీ బలంగా పుంజుకోవడం మనకు కనిపించే ఆనవాయితీ. పైగా ఈ స్టాక్ గత కొన్ని రోజులుగా పతనమైంది. నెల రోజుల్లో 5.4శాతం మేర డౌన్ అయ్యింది. అందుకే, సోమవారం స్టాక్ పడినా, పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మహేష్ ఓజా సలహా ప్రకారం.. “ఇప్పటికే రిలయన్స్ షేర్లు కలిగి ఉన్న వారు, రూ. 1400 స్థాయికి చేరువైనప్పుడు మరిన్ని షేర్లను యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు రూ. 1400 వద్ద కొనుగోలు చేయవచ్చు. వీరికి రానున్న రోజుల్లో రూ. 1508, రూ. 1540 టార్గెట్లు కనిపిస్తున్నాయి. అయితే, రూ. 1380 వద్ద ఖచ్చితమైన స్టాప్ లాస్ పాటించడం మర్చిపోవద్దు.”
అయితే, రిలయన్స్ వంటి భారీ వెయిటేజీ ఉన్న షేరులో కదలికలు మొత్తం సెన్సెక్స్, నిఫ్టీల దిశను మారుస్తాయి కాబట్టి, సోమవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం అవసరం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


