నూతన గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఇన్వెస్ట్​ చేయొచ్చా?

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనపడటంతో బంగారం, వెండి ధరలు బుధవారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఎంసీఎక్స్ మార్కెట్​లో బంగారం 10 గ్రాములు రూ. 1,38,469 పలుకగా, కిలో వెండి ఏకంగా రూ. 2.23 లక్షల మార్కును తాకింది. మరి ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్​ చేయొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Published on: Dec 24, 2025, 10:30:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు బుధవారం (డిసెంబర్ 24) ఉదయం సరికొత్త రికార్డు శిఖరాలను అధిరోహించాయి. దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్​లో బుధవారం ఉదయం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.42 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,469 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. మరోవైపు వెండి ధరల దూకుడు చూస్తే కళ్లు చెదరాల్సిందే! మార్చ్​ సిల్వర్ కాంట్రాక్టులు దాదాపు 2 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,23,742 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది.

నూతన గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు.. (Photo: Pixabay)
నూతన గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు.. (Photo: Pixabay)

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధర తొలిసారి ఔన్సుకు 4,500 డాలర్లు దాటింది. స్పాట్​ సిల్వర్​ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది. ఫలితంగా స్పాట్​ సిల్వర్​ వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నట్టు అయ్యింది.

బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలు..

అమెరికా- వెనుజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ దేశం నుంచి వస్తున్న ఆయిల్​ ట్యాంకర్లను అమెరికా ఆపేయడంతో ఇరు దేశాల మధ్య బంధంపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో డాలర్​ ఇండెక్స్​ కూడా పడుతూ వస్తోంది. ఫలితంగా “సేఫ్​ హెవెన్​”గా భావించే బంగారం, వెండివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు యూఎస్​ ఫెడ్​ రేట్​ కట్​పైనా అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా బంగారం, వెండి ధరల వృద్ధి కారణంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్​ల్లోకి పెట్టుబడుల ప్రవాహాలు కూడా బంగారం, వెండికి జోష్​ ఇచ్చాయి.

బంగారం కన్నా వెండి విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. ఇయర్​ ఆన్​ ఇయర్​ ప్రాదిపతికన బంగారం 76శాతం వృద్ధి చెందగా, వెండి మాత్రం ఏకంగా 140శాతం కన్నా ఎక్కువ పెరిగింది. 1979 తర్వాత వెండికి ఇదే బలమైన ప్రదర్శన.

బంగారం, వెండి ధరలు- ఈ లెవల్స్​ కీలకం..

Prithvifinmart కమోడిటీ రీసెర్చ్​కి చెందిన మనోజ్​ కుమార్​ జైన్​ ప్రకారం.. బంగారం ధర ట్రాయ్​ ఔన్సుకు 4,284 డాలర్లు- 4,580 డాలర్ల మధ్య ట్రేడ్​ అవ్వొచ్చు. ఈ వారం వెండి ట్రాయ్​ ఔన్సుకు 66.40 డాలర్లు- 74 డాలర్ల వద్ద కొనసాగవచ్చు.

“ఎంసీఎక్స్​ గురించి మాట్లాడుకుంటే.. బంగారానికి రూ. 1,36,660- 1,35,800 వద్ద సపోర్ట్​, రూ. 1,38,850- రూ. 1,40,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. వెండికి రూ. 2,17,700- రూ. 2,16,00 వద్ద సపోర్ట్​, రూ.2,22,000- రూ. 2,25,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని జైన్​ వెల్లడించారు.

“క్రిస్మస్​ సెలవులకు ముందు బంగారం రూ. 1,40,000 వద్ద- సిల్వర్​ రూ. 2,24,000 వద్ద ప్రాఫిట్స్​ని బుక్​ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. మళ్లీ కొనుగోలు చేసే ముందు వేచి చూడండి. ధరలు పడిన తర్వాత కొత్తగా కొనుగోలు చేయవచ్చు,” అని జైన్​ స్పష్టం చేశారు.

మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంసీఎక్స్ బంగారానికి రూ. 1,38,650 - రూ. 1,39,470 వద్ద రెసిస్టెన్స్​ ఉందని, వెండికి రూ. 2,22,970 వద్ద రెసిస్టెన్స్​ ఉందని పేర్కొన్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More