ట్రేడర్స్​ అలర్ట్​- ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

జనవరి 19, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 19, 2026, 08:15:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 188 పాయింట్లు పెరిగి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 29 పాయింట్లు వృద్ధిచెంది 25,694 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 515 పాయింట్లు పెరిగి 60,095 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,346.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,935.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ జనవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 26,052.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 34,076.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,500- 25,450 జోన్​ కీలక సపోర్ట్​గా ఉంది. 25,875- 25,900 జోన్​ రెసిస్టెన్స్​గా ఉంది. ఈ రెండింటిలో ఏది బ్రేక్​ అయినా సూచీ అటువైపు బలంగా కదలి అవకాశం ఉంది,” అని ఏంజిల్​ వన్​కి చెందిన చీఫ్​ మేనేజర్​- టెక్నికల్​ అండ్​ డెరివేటివ్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ ఓషో కృష్ణన్​ తెలిపారు.

  • Reliance share : క్యూ3 ఫలితాల తర్వాత రిలయన్స్​ స్టాక్​ డౌన్​? కొనాలా? అమ్మేయాలా? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.17 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.06శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.06 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​- బై రూ. 1025, స్టాప్​ లాస్​ రూ. 990, టార్గెట్​ రూ. 1100

ఎల్​టీఐ మైండ్​ట్రీ- బై రూ. 6308, స్టాప్​ లాస్​ రూ. 6100, టార్గెట్​ రూ. 6750

ఐఈఎక్స్​- బై రూ. 140, స్టాప్​ లాస్​ రూ. 124, టార్గెట్​ రూ. 152

చోలమండలం ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ ఫైనాన్స్​- బై రూ. 1700, స్టాప్​ లాస్​ రూ. 1670, టార్గెట్​ రూ. 1750

భారతీ ఎయిర్​టెల్​- బై రూ. 2015, స్టాప్​ లాస్​ రూ. 2000, టార్గెట్​ రూ. 2150

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

యూపీఎల్​- బై రూ. 790.15, స్టాప్​ లాస్​ రూ. 761

టెక్​ మహీంద్రా- బై రూ. 1670.50, స్టాప్​ లాస్​ రూ. 1600, టార్గెట్​ రూ. 1815

బ్యాంక్​ ఆప్​ బరోడా- బై రూ. 308.25, స్టాప్​ లాస్​ రూ. 295, టార్గెట్​ రూ. 330

జేఎస్​డబ్ల్యూ స్టీల్​- బై రూ. 1187, స్టాప్​ లాస్​ రూ. 1145, టార్గెట్​ రూ. 1280

గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 2809, స్టాప్​ లాస్​ రూ. 2700, టార్గెట్​ రూ. 3000

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More